నల్ల రిబ్బన్లతో విధులకు హాజరు

Dec 4,2023 16:40 #Vizianagaram
angawadi workers protest

నాలుగవ రోజు అంగన్వాడీలు
డివిజన్ కార్పొరేటర్లకు, సచివాలయ కార్యదర్శులకు వినతి
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : అంగన్వాడీ వర్కర్స్ & హెల్పర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 4వ రోజు సోమవారం నాడు అంగన్వాడి వర్కర్లు, హెల్పర్లు విధులకు హాజరయ్యారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.పైడ్రాజు, ప్రాజెక్ట్ అధ్యక్ష కార్యదర్శులు శివలక్ష్మి, విశాలాక్షిలు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మా సమస్యలు పరిష్కారం చేయాలని, ముఖ్యమంత్రి అంగన్వాడీలకు ఇచ్చిన హామీ లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. 8 తేదీ నుంచి చేపట్టనున్న సమ్మెలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యలు పరిష్కారం చేసి సమ్మె జరగకుండా చూడాలన్నారు. ప్రభుత్వం సమస్యలు పరిష్కారం చేయకుంటే సమ్మె కొనసాగుతుందని తర్వాత పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. నిరసన కార్యక్రమం లో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు పాల్గొన్నారు.

➡️