కడప పార్లమెంట్‌ బరిలో షర్మిల?

Apr 1,2024 21:09

సొంత జిల్లాలో పట్టు నిరూపణకు యత్నం
అసెంబ్లీలకు బలమైన అభ్యర్థుల అన్వేషణ
షర్మిలను కలిసిన ఓ మాజీ ఎమ్మెల్యే
నేడు జిల్లాకు షర్మిల రాక
రాజంపేట పార్లమెంట్‌కు నజీర్‌అహ్మద్‌
ప్రజాశక్తి – కడప ప్రతినిధి/ రాయచోటి
జిల్లా రాజకీయాలపై వైసిపి గట్టి పట్టు సాధించింది. మాజీ ముఖ్య మంత్రి వైఎస్‌ఆర్‌ మరణానంతరం జరిగిన ప్రతి ఎన్నికల్లో ఆస్పష్టమైన ఆధి పత్యాన్ని సాధిస్తూ వస్తోంది. వైసిపి ఆవిర్భావం నుంచి ప్రతిపక్ష టిడిపి ఎదురు దెబ్బలు తప్పడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వైఎస్‌ షర్మిల కడప పార్లమెంట్‌ బరిలో నిలవడం ఆసక్తిని కలిగిస్తోంది. సొంత జిల్లాలో పట్టు సాధించడానికి అవసరమైన ఓట్లు, సీట్లు సాధించడంపై దృష్టి సారించింది. దీనిపై ఆధారపడి ఆమె రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉం టుందని చెప్పవచ్చు. జిల్లాలోని కడప, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేల్‌ నియోజకవర్గాల్లో ప్రాబల్యం కలిగిన నాయక గణాన్ని అన్వేష ిస్తోంది. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల బరిలో బలమైన అభ్యర్థులను నిలిపి ఆశావహమైన ఓట్లు, సీట్లు సాధిస్తే భవిష్యత్‌ అధికార, ప్రతిపక్ష పార్టీలకు ప్రమాదకర సంకే తాలు ఇచ్చినట్లు అవుతుంద నడంలో సందేహం లేదు. జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీలు అసెంబ్లీ, పార్లమెంట్‌ స్థానా లకు అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ సైతం అభ్యర్థుల ప్రక టన కసరత్తు వేగవంతం చేసింది. నేడో, రేపో అభ్యర్థుల జాబితాను విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. కడప పార్లమెంట్‌కు షర్మిల, రాజంపేట పార్లమె ంట్‌కు మాజీ డిసిసి అధ్యక్షులు నజీర్‌ అహ్మద్‌ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. వైఎస్‌ షర్మిల పిసిసి బాధ్యతలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్‌ బలో పేతంపై దృష్టి సారించింది. ఇప్పటికే జిల్లాలో రెండు దఫాలు పర్యటించారు. ప్రతి పర్యటనలో ఆశించిన స్పందన లభించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో కడప పార్లమెంట్‌కు ఆమె పోటీ చేయనున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో పార్టీని మరింత బలపేతం చేయడంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌ పార్టీ ముఖ్య నేతలు, సీనియర్‌ నాయకులతో సంప్రదింపులు చేసింది. మాజీ మంత్రులు డిఎల్‌, అహ్మదుల్లాలను కలిసిన సంగతి తెలిసిందే. వీరితోపాటు టిడిపి, వైసిపిలో టికెట్లు దక్కని నాయకులపై దృష్టి సారించే అవకాశం కనిపిస్తోంది. మంగళవారం సాయంత్రం అమీర్‌ ఫంక్షన్‌ హాలులో ఏర్పాటు చేయనున్న ఇఫ్తార్‌ విందుకు వచ్చినప్పుడు సంప్రదింపులు వేగవంతం చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.రాజంపేట పార్లమెంట్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా నజీర్‌ అహ్మద్‌ రాజంపేట పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థిగా కడపకు చెందిన ఫేక్‌.నజీర్‌ అహ్మద్‌ను సోమవారం కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ఎంపిక చేసింది. ఈయన గతంలో 2019 సంవత్సరంలో కడప అసెంబ్లీ నుంచి పోటీ చేశారు. గతంలో కడప ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షులుగా పనిచేశారు. ప్రస్తుతం మైనార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేస్తున్నారు. ఇప్పటికే వైసిపి నుంచి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, బిజెపి నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి పోటీలో ఉన్నారు. దీంతో జిల్లాలో అన్ని పార్టీలు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇప్పటికే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ, మహా కూటమి ఎంపీ అభ్యర్థులు ప్రచారం మొదలుపెట్టారు. సోమవారం కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ అభ్యర్థుల ఎంపిక చేయడంతో పార్లమెంట్‌ పరిధిలోని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు వర్షం వ్యక్తం చేస్తున్నారు.

➡️