జాతీయ స్థాయిలో 10 వ స్థానం సాధించిన కలికిరి కెవికె

ప్రజాశక్తి-కలికిరి (రాయచోటి-అన్నమయ్య) : భారత జాతీయ సాంకేతిక పరిశోధన మండలి (ఆటారీ జోన్‌-హైదరాబాద్‌ ) ఆధ్వర్యంలో రాజమండ్రి లోని కేంద్రీయ పొగాకు పరిశోధనా స్థానం వద్ద కఅషి విజ్ఞాన కేంద్రాల వార్షిక జోనల్‌ సదస్సు ఈ నెల 25 నుండి 27 వరకు నిర్వహించడం జరిగిందని కెవికె కదిరి కోఆర్డినేటర్‌ డాక్టర్‌ పాండురంగ తెలిపారు. ఇందులో ఎపి, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరి పరిధిలో ఉన్న 72 కఅషి విజ్ఞాన కేంద్రాల సమన్వయ కర్తలు పాల్గన్నారు. గత సంవత్సరం 2023-2024 లో నిర్వహించిన ప్రధమ శ్రేణి, క్షేత్ర పరిశీలన, శిక్షణ, విస్తరణ కార్యక్రమాలను ఆధారం చేసుకుని బహుమతులు ప్రశంసాపత్రాలు జారీ చేశారు. క్షేత్ర పరిశీలన ద్వారా నూతన వేరుశనగ టి. సి. జి. ఎస్‌-1694 (విశిష్ట) రకం ద్వారా బెట్ట పరిస్థితులలోనూ రైతు అధిక దిగుబడి సాధించడం, జిల్లాలో మామిడి రైతులు ఫ్రూట్‌ కవర్లు వాడకం ద్వారా నాణ్యమైన మామిడి కాయలు పొందడం పై విరివిగా అవగాహహన కల్పించినందుకు కఅషి విజ్ఞాన కేంద్రం, కలికిరి తరపున సమన్వయకర్త డాక్టర్‌ జి.ఎస్‌.పాండురంగా కు అవార్డులు డాక్టర్‌ ఎస్‌.ఎన్‌.మీరా, డైరెక్టర్‌, ఆటరీ జోన్‌, హైదరాబాద్‌ వారి చేతుల మీదుగా అందుకున్నారు. ఆటారీ జోన్‌-పరిధిలోని 72 కేవీకే లలో కేవీకే, కలికిరి ఉత్తమ కేవీకే లలో 10 వ స్థానం సాధించింది. అదేవిధంగా సంస్థలో పనిచేస్తున్న వివిధ శాస్త్రవేత్తలకు, ఇతర సిబ్బందికి వికసిత్‌ భారత్‌ సంకల్ప యాత్రలో పాల్గని గ్రామీణ ప్రజలకు వ్యవసాయంలో వివిధ పథకాల గురించి వివరించినందుకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సదస్సులో మామిడి అంటు మొక్కల తయారీ, వివిధ పంటల్లో అడవి పందుల యాజమాన్యం పైన ప్రచురణలు విడుదల చేశారు. ఈ సందర్భంగా కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్‌ డాక్టర్‌ జి.ఎస్‌.పాండు రంగా మాట్లాడుతూ … కేవీకే లోని శాస్త్రవేత్తలు, డాక్టర్‌ కె.మాధురి, ఎస్‌.సోమ శేఖర్‌ బాబు, డాక్టర్‌ వై.పీరు సాహెబ్‌, డాక్టర్‌ ఏ. శ్రీనివాసులు, బి.రమణ (ప్రోగ్రామ్‌ అసిస్టెంట్‌ కంప్యూటరు), ఇతర భోదనేతర సిబ్బంది కఅషి వలన ఈ అవార్డులు వచ్చాయని సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. రైతులకు లాభదాయకమైన నూతన టెక్నాలజీల గురించి విరివిగా అవగాహన కల్పించాలని సూచించారు.

➡️