నాణ్యమైన విద్యుత్‌ను అందించాలి :ఎస్‌ఇ

ప్రజాశక్తి-రామాపురం ప్రజలకు నాణ్యమైన విద్యుత్తును అందించడమే ప్రధాన ఉద్దేశమని విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ రమణ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రమైన రామాపురంలోని విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ను పరిశీలించారు. అనంతరం రహదారులు భవనాల శాఖ అతిథి గహంలో విద్యుత్‌ శాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఇ మాట్లాడుతూ ప్రస్తుతం వేసవికాలం సమీపిస్తుండటంతో ట్రాన్స్‌ఫార్మర్లును పర్యవేక్షించి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.విద్యుత్‌ ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల, పగటి వేళల్లో విద్యుత్‌ దీపాలు ఎక్కడ వెలగకుండా చూడాలని చెప్పారు. ప్రభుత్వం నిబంధనల మేరకు రైతులకు అందించాల్సిన విద్యుత్తును సకాలంలో అందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో డిఇ చంద్రశేఖర్‌ రెడ్డి, ఎడిఎ విజయకుమార్‌ రెడ్డి, రామాపురం ఎఇ వరప్ర సాద ్‌రెడ్డి, వీరవల్లి ఎఇ రమేష్‌బాబు, లక్కిరెడ్డిపల్లె ఎఇ హరిప్రసాద్‌, లైన్‌మేన్‌లు పాల్గొన్నారు.విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ తనిఖీవీరబల్లి : మండలంలోని వీరబల్లి, ఉప్పరపల్లి, మట్లి, విద్యుత్‌ సబ్‌ స్టేషన్లను విద్యుత్‌ శాఖ ఎస్‌ఇ రమణ శుక్రవారం తనిఖీ చేశారు. విద్యుత్‌ సంబంధిత రికార్డులను, విద్యుత్‌ యూనిట్ల వాడకాన్ని పరిశీలించారు. వ్యవసాయ రైతుల సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. 9గంటల పూర్తి విద్యుత్‌ ఇవ్వాలని సూచించారు. లో వోల్టేజీ సమస్య లేకుండా గ్రామాల్లో విద్యుత్‌ సరఫరా సక్రమంగా ఉండేలా చూడాలన్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది, విధుల్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. విద్యుత్‌ సంబంధించిన ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించాలని చెప్పారు. ఎంపిపి రాజేంద్రనాథ్‌ రెడ్డి ఎస్‌ఇని మర్యాదపూర్వకంగా కలిశారు. వేసవి కాలంలో విద్యార్థులు, రైతులు, విద్యుత్‌తో ఇబ్బంది పడకుండా నిరంతరాయంగా సరఫరా ఉండాలని ఎస్‌ఇని కోరారు. ఈ తనిఖీల్లో విద్యుత్‌ శాఖ డిఇ చంద్రశేఖర్‌రెడ్డి, ఎడిఇ విజరుకుమార్‌రెడ్డి, ఎఇ రమేష్‌బాబు, సబ్‌ ఇంజనీర్‌ కేశవ, లైన్‌ఇన్స్‌్‌పెక్టర్‌ రెడ్డయ్య, సిబ్బంది ఉన్నారు.

➡️