సమ్మె హామీలు అమలు చేయాలి- ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ నాయకులు

ప్రజాశక్తి-రాయచోటి టౌన్‌ మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్బంగా ఇచ్చిన గత ప్రభుత్వ హామీ లను అమలు చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ ఫెడరేషన్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బివి.రమణ, పివి.రమణ డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమా వేశంలో వారు మాట్లాడుతూ గతంలో16 రోజుల సమ్మెకు వైసిపి ప్రభుత్వం దిగొచ్చి సమ్మెకాలం వేతనంతో పాటు డ్రైవర్లకు రూ.24,500లు వేతనం ఇవ్వాలని జిఒలో ఉన్నా అన్నమయ్య జిల్లా లోని మున్సిపాలిటీలో అమలు కాలేదని అన్నారు. ఎన్నికల లో రెండు లేదా మూడు రోజుల పాటు పని చేసిన కార్మికలకు స్టైఫండ్‌ ఇచ్చారని రాజంపేట, రాయచోటి మున్సిపాలిటీలలో కూడా వెంటనే ఇవ్వాల న్నారు. ఇంజినీరింగ్‌ కార్మికులకు స్కిల్డ్‌, సెమిస్కిల్డ్‌ వేతనాలు ఇవ్వాలని, క్లాప్‌ డ్రైవర్లకు కనీస వేతనం రూ.18,500అమలు చేయాలని కోరారు. నాణ్యమయిన పనిముట్లతో పాటు మాస్కులు, కొబ్బరినూనె, చెప్పులు, మూడు ఖాతాలుగా పిఎఫ్‌ ఖాతాలు సరిచేసి ఒక ఖాతాగా ఇవ్వడంలో అలసత్వం విడనాడాలని మున్సిపల్‌ అధికారులను కోరారు. కార్యక్రమంలో జిల్లా కోశాధికారి సి.రాంబాబు, పి.విజయకుమార్‌ పాల్గొన్నారు.

➡️