అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ రావాలి

Dec 17,2023 16:10 #Annamayya district
congress protest in pileru

ప్రజాశక్తి-పీలేరు: రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రజలకు సక్రమంగా సంక్షేమ పథకాలు అందాలన్నా కాంగ్రెస్ రావాలని పీలేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ తెలిపారు. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అనే నినాదంతో ఆదివారం పీలేరు క్రాస్ రోడ్ నాలుగు రోడ్ల కూడలిలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రంగాలు అభివృద్ధి కావాలన్నా, అర్హులైన ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, ప్రత్యేక హోదా ఇవ్వాలన్నా, కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండూ రెండు కళ్ళని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపనిచ్చారు. ఈ కార్యక్రమంలో పీలేరు నియోజకర్గ కన్వీనర్ రెడ్డి సాహెబ్, మండల అధ్యక్షులు శ్రీకాంత్, తంబళ్లపల్లె కన్వీనర్ సోమశేఖర రెడ్డి, మదనపల్లి కన్వీనర్ లీల శ్రీనివాస్, ఇతర నాయకులు రామచంద్ర, ఎన్.ఎస్.యు.ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమృత్ తేజ, అన్నమయ్య జిల్లా అధ్యక్షులు సంపత్, పీలేరు నియోజకర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️