ప్రజాస్వామ్య పరిరక్షణ ఓటర్ల బాధ్యత

Apr 4,2024 13:20 #Annamayya district

ప్రజాశక్తి-పీలేరు: సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి ఓటరూ తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకుని, ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలని పీలేరు నియోజకవర్గం ఓటరు నమోదు అధికారిణి, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్.డి.సి రమా తెలిపారు. గురువారం పీలేరు సహాయ ఎన్నికల అధికారి మహబూబ్ బాష ఆధ్వర్యంలో ఓటు హక్కు, ఓటు విలువ, ఓటు ఆవశ్యకతలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ పట్టణ వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ స్థానిక తహశీల్దారు కార్యాలయం నుంచి నెహ్రూ బజార్, సాయిబాబా గుడి వీధి, అంబేద్కర్ సర్కిల్, ఎల్.బి.ఎస్ రోడ్డు, ఆర్టీసీ బస్టాండు మీదుగా గాంధీ సర్కిల్ వరకు నిర్వహించారు. అనంతరం నాలుగు రోడ్ల కూడలిలో మానవహారంగా ఏర్పడి అందరి చేత ఓటు హక్కు సద్వినియోగంపై ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పీలేరు నియోజకవర్గం పరిధిలోని కెవి పల్లి, కలికిరి మండలాల ఎన్నికల సహాయ అధికారులు నయాజ్ అహ్మద్, విజయ కుమారి, ఇతర మండలాల ఎన్నికల సహాయకులు, రెవెన్యూ ఉద్యోగులు, సిబ్బందితో పాటు పీలేరు సీఐ మోహన్ రెడ్డి, సిబ్బంది, ఎంఈఓలు లోకేశ్వర్ రెడ్డి, పద్మావతి, సంజయ్ గాంధీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ రెడ్డి, భారతి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్, వెలుగు ఏపిఎం లక్ష్మణ్ రెడ్డి, ఐసిడిఎస్ పీలేరు ప్రాజెక్టు సిడిపిఓ రాజమ్మ, ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ఎం నటరాజన్,
మాజీ సైనికోద్యోగులు, ప్రభుత్వ పెన్షన్ దారుల సంఘం, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, వికలాంగుల సంక్షేమ సంఘం, ఎన్.సి.సి, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️