ఘనంగా బక్రీద్ పండుగ 

Jun 17,2024 10:14 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: బక్రీద్ పండుగను మండలంలోని కలకడ, కోన, నడిపిచర్ల పాపి రెడ్డి గారి పల్లి, ఎర్రకోటపల్లి, ఎర్రయ్య గారి పల్లి తదితర గ్రామాలలో ముస్లిం సోదరులు త్యాగానికి మారుపేరుగా నిర్వహించుకుంటారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకునే బక్రీదు పండుగకు చాలా పురాతన చరిత్ర చెబుతోంది. పూర్వకాలం ఇబ్రహీం ప్రవర్తకు సంతానం లేకపోవడంతో ఎన్నో పూజలు వల్ల అల్లా దయవల్ల ఇస్మాయిల్ అనే కుమారుడు జన్మిస్తాడని అతడు నిద్రిస్తున్న సమయంలో కత్తితో మెడపై నరికిన కాట్లు ఉండడం గల స్వప్నం రావడం ఆ విషయం తండ్రి ఇబ్రహీం చెప్పడంతో ఇబ్రహీం ఒంటెను కుర్బానీగా ఇస్తాడని అయినప్పటికీ తన కుమారుడు ఇస్మాయిల్ కు తిరిగి స్వప్నంలో మెడను నరికినట్లు రావడం జరుగుతూ ఉండటంతో చివరకు తన కుమారునితో నిన్ను అల్లాకు బలి ఇస్తానని చెప్పడంతో కుమారుడు ఇస్మాయిల్ ఒప్పుకోవడం జరిగిందని, ఈ క్రమంలో తన కుమారుడిని నరుకుతున్న సమయంలో అల్లాహ్ ప్రత్యక్షమై ‘నీ త్యాగానికి నేను ముగ్దుడైయానని నీ కుమారుడిని వధించవద్దని ప్రత్యేక నెమరువే జంతువును నాకు కురుబానిగా ఇవ్వాలని’ చెప్పినట్లు చరిత్ర చెబుతోంది. ఈ క్రమంలోనే ముస్లింలు కుర్బానీగా జంతువును వధించి మూడు భాగాలు చేసి ఒక భాగాన్ని పేదలకు ఇంకొక భాగాన్ని బంధువులకు మూడవ భాగాన్ని తన కుటుంబ సభ్యులు భుజించడం జరుగుతుందని చరిత్ర చెబుతున్నది. ఈ క్రమంలోనే ముస్లిం సోదరులు బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో ఈద్గాల వద్దకు వెళ్లి ప్రార్థన నిర్వహించి మత పెద్దలు బోధించే బోధనలను విని తమ పూర్వీకుల సమాధుల వద్ద ప్రార్థనలు గావించి జంతువులను కుర్బానీ చేసి అత్యంత వైభవంగా బక్రీద్ పండుగ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అనంతరం ముస్లిం సోదరులు ఆలింగనం చేసుకుని బక్రీద్ శుభాకాంక్షలు తెలుసుకోవడం అనాదిగా

➡️