కలకడలో 363మంది ఇంటర్ పరీక్షలకు హాజరు

Mar 1,2024 12:35 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: 2023-24 సంవత్సరానికి గాను ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమైనట్లు సీఎస్ ఎం రమణయ్య తెలిపారు. మార్చి 1వ తేదీ నుండి జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు శుక్రవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు 377 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 14 మంది గైహాజరై 363 మంది పరీక్షలు రాసినట్లు ఆయన తెలిపారు. పరీక్షలను పగడ్బందీగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు ఎవరైనా కాపీలు పాల్పడితే చర్యలు చేపట్టి, డిబార్ చేయడం జరుగుతుందన్నారు. పరీక్షలను పోలీసు బందోబస్తు మధ్య నిర్వహిస్తున్న ఎస్ఐ రామకృష్ణారెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ అధికారి వెంకటరమణ పాల్గొన్నారు.

➡️