మహిళా సాధికారిత పోస్టర్లు ఆవిష్కరణ

Jan 24,2024 16:05 #Annamayya district
jsp women empowerment poster release

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాజంపేట నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త అతికారి దినేష్ బుధవారం పట్టణ పరిధిలోని తన కార్యాలయంలో మహిళా సాధికారత పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ జనసేన పార్టీ మధ్య మహిళా సాధికారితే లక్ష్యంగా ప్రతి ఆడపడుచుకు అండగా ఉంటుందని తెలిపారు. భ్రూణ హత్యలు నిషేధించి, బాలిక విద్యను ప్రోత్సహించాలని, స్త్రీ చదువుకుంటే కుటుంబానికి వెలుగునిస్తుందని తెలిపారు. భావితరాల భవిష్యత్తు యువతి, యువకుల చేతుల్లో ఉందని.. చిన్నతనం నుంచే మహిళల పట్ల గౌరవ మర్యాదలు కలిగేటట్లు తల్లిదండ్రులు పిల్లల్ని పెంచాలని సూచించారు. జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నం పెట్టే రైతన్నను, మహిళామూర్తులను దైవ సమానులుగా చూడాలని అనేక వేదికలుగా పలుమార్లు ప్రస్తావించడం మహిళల పట్ల ఆయనకున్న గౌరవాన్ని సూచిస్తుందని తెలిపారు. జనసేనాని బాటలోనే జనసైనికులు కూడా నడుచుకుంటూ మహిళలు, వృద్ధులు, పేదల పట్ల కరుణాభావంతో మెలగాలని సూచించారు. జనసేన, టిడిపి కూటమి అధికారంలోకి రాగానే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు వారి సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రణాళిక అబద్ధం గా ముందుకు వెళ్లడం జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి అభిమాన సంఘం నాయకులు రంజిత్ కుమార్, జనసేన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

➡️