మన పంతం… టీబి అంతం…

Mar 24,2024 13:01 #Annamayya district

ప్రజాశక్తి-కలకడ: మన పంతం.. టిబి వ్యాధి అంతం చేయడమేనని ఎర్రకోటపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి జవహర్ బాబు పేర్కొన్నారు. మండలంలోని ఎర్రకోట పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డా,,పి.జవహర్ బాబు ఆధ్వర్యంలో జాతీయ క్షయ వ్యాధి దినోత్సవ కార్యక్రమాన్ని జరుపుకొన్నాము. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి పాపిరెడ్డి పల్లి పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించడం జరిగినది. టీ.బీ లక్షణాలు ఈ విధంగా ఉన్నాయని తెలిపారు. బరువు తగ్గుట, పైబడి దగ్గు ఎక్కువ ఉండుట,రాత్రిపూట జ్వరం రావడం, చాతి నొప్పి రావటం, కండ్లలో రక్తం పడటంపై లక్షణాలు ఉంటాయి. బ్యానరు ప్లే కార్డులతో గ్రామ పురవీధుల గుండా ఈ క్రింది విధముగా టీబీ పై పోరాటం- మన అందరి బాధ్యత అని, టిబి వ్యాధి నీ చెంత – కృంగిపోకు రవ్వంత, చేయి చేయి కలుపుదాం – టీ.బి ని తరిమికొడదాం, మన పంతం -టీ.బి అంతం, గాలి వెలుతురు లేని నివాసం – టిబి జబ్బుకు ఆవాసం, వేయించుకో బీసీజీ టీకా- నిరోధించు టీబీ రాక, టిబి అంటే భయం వద్దు – చికిత్స నీ ముందు,డాట్ చికిత్స – టీవీ వ్యాధిగ్రస్తుని ఆరోగ్య రక్ష. ఈ కార్య క్రమంలో ఎం.పీ.హెచ్.ఈ.ఓ. జి.జయరామయ్య, పీ.హెచ్.ఎన్. కే.సుబ్బరత్నమ్మ, స్టాఫ్ నర్స్ జె.భారతమ్మ, హెల్త్ సూపర్వైజర్స్ ఎం.వెంకటేశ్వరరావు, బి.రెడ్డమ్మ, ఆరోగ్య కార్యకర్తలు ఎన్.వాణి, డి.వరలక్ష్మి, ఎస్వి. రమణమ్మ, ఆశా కార్యకర్తలు టీ. గురు శాంత, కే.పార్వతి, జే.రమణమ్మ, ఎం. ఎన్. ఓ. బి.అలివేలు, మంగ భాయి అటెండర్ సునీత, పాల్గొన్నారు.

➡️