విద్యార్థులకు ప్రాక్టికల్ అధ్యయనం చాలా అవసరం

Mar 6,2024 12:37 #Annamayya district
Practical study is essential for students

ప్రజాశక్తి-పీలేరు: విద్యార్థులకు పుస్తక పఠనంతోపాటు ప్రాక్టికల్ అవగాహన చాలా అవసరమని పీలేరు ఎంజెఆర్ కాలేజ్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చైర్మన్ అవినాష్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. సుధాకర్ రెడ్డి తెలిపారు. కళాశాలలో 3వ సంవత్సరం ఈఈఈ, మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు అకాడెమిక్ శిక్షణలో భాగంగా బుధవారం పీలేరులో 33/11కెవి విద్యుత్ సబ్ స్టేషన్ సందర్శనకు తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమాన్ని చైర్మన్, ప్రిన్సిపాల్ ప్రారంభించారు. సబ్ స్టేషన్ కు వచ్చిన విద్యార్థులకు అక్కడి అసిస్టెంట్ ఇంజనీరు రాంప్రసాద్ రెడ్డి సబ్ స్టేషన్ ద్వారా విద్యుత్ వినియోగదారులకు అందిస్తున్న సేవలు, విద్యుత్ పరికరాల పని విధానం, ఎదురయ్యే సమస్యలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించిన పూర్తి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక బృందం డాక్టర్ ఎస్. రెడ్డి ఖాసీం, సుహేల్, భరత్, బాలాజి, కల్పన, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️