బి.కొత్తకోట తహసీల్దార్ పుణ్యవతి

Feb 5,2024 11:35 #Annamayya district
punyavathi as new mro

ప్రజాశక్తి – బి.కొత్తకోట : అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలం నూతన తహశీల్దార్ గా పుణ్యవతి సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టారు.ప్రస్తుతం సత్య సాయి జిల్లా నుంచి  పనిచేస్తున్న ఆమెను బి.కొత్తకోట తహసీల్దారుగా పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా నూతన తహసిల్దార్ పుణ్యవతి మాట్లాడుతూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు.అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పనిచేసి మండల అభివృద్ధిలో భాగస్వామ్యమినవుతానన్నారు. నూతన తహసిల్దార్ గా బాధ్యతలు చేపట్టిన పుణ్యవతి కు వివిధ శాఖల అధికారులు,సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు.

➡️