కారు స్కూటర్ ఢీ – పలువురికి గాయాలు

Dec 16,2023 15:49 #Annamayya district
road accident in kalakada

తృటిలో తప్పిన పెను ప్రమాదం
ప్రజాశక్తి-కలకడ: కారు స్కూటర్ ఢీకొన్న ప్రమాదంలో పలువురికి గాయాలను సాధన మండలంలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. మండలంలోని బాటవారిపల్లి పంచాయతీ చిత్తూరు- కర్నూలు జాతీయ రహదారిపై పోతువారిపల్లి సమీపము నందు జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. అన్నమయ్య జిల్లా వీరబల్లికి చెందిన రెడ్డప్ప నాయుడు పక్షవాతంతో బాధపడుతుండటంతో అతనిని కారులో పలమనేరులో పక్షవాతానికి మందు తీసుకోవడానికి బయలుదేరినట్లు తెలిపారు. ఈ క్రమంలో పోతువారిపల్లి నందు ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు రోడ్డు ప్రక్కన బోల్తా పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదం వల్ల పెను ప్రమాదం తమ్మినట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో ప్రయాణిస్తున్న పోతువారిపల్లి కు చెందిన రాధాకృష్ణకు కాలికి బలమైన గాయం కావడంతో స్థానిక ప్రైవేటు వైద్యశాలలు వైద్యం చేయించినట్లు తెలిపారు. కారులో ప్రయాణిస్తున్న నలుగురిని 108 వాహనంలో వైద్యశాల నిమిత్తం రాయచోటికి తరలించినట్లు 108 సిబ్బంది తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి వెళ్లి సంఘటన స్థలాన్ని పరిశీలించినట్లు పోలీసులు తెలిపారు.

➡️