ప్రచారం ప్రారంభించిన సుగవాసి

Apr 10,2024 14:20 #Annamayya district

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఎన్ డీ ఏ కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగవాసి బాల సుబ్రహ్మణ్యం రాజంపేట పార్లమెంట్ అధ్యక్షులు చమర్తి జగన్ మోహన్ రాజుతో కలిసి బుధవారం ఆంజనేయ స్వామి దేవస్థానం నందు ప్రత్యేక పూజలు నిర్వహించి ఈడిగ పాలెం నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి మ్యానిఫస్తో కరపత్రాలు పంపిణీ చేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా సుగవాసి మాట్లాడుతూ రాజంపేటలో వైద్య కళాశాల తీసుకువస్తానని, అన్నమయ్య డ్యాం పునర్నిర్మాణం చేస్తామని, గతంలో ఆగుతున్న రైళ్లను తిరిగి ఆగేటట్లు చూస్తామని, ట్రాఫిక్ సమస్యలను నియంత్రించి రోడ్లు వెడల్పు చేస్తామని, పట్టణంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

➡️