దివ్యాంగుడికి ట్రై సైకిల్ అందజేత

Mar 8,2024 16:36 #Annamayya district
Tricycle will be given to the disabled

ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో 
ప్రజాశక్తి – బి.కొత్తకోట : నగర పంచాయతీ, హట్కో కాలనీలో నివాసముంటున్న దివ్యాంగుడు సి.లక్ష్మినారాయణకు బి.కొత్తకోట వైఎస్సార్సీపీ నాయకులు బ్యాటరీ ట్రై సైకిల్ ను అందజేశారు.ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి స్టేట్ మైనారిటీ సెక్రటరీ ఎన్జీవో మెంబర్ మాలిక్ ఖాద్రి మాట్లాడుతూ దివ్యాంగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడమే లక్ష్యంగా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి,తంబళ్లపల్లి శాసనసభ్యులు ద్వారకనాథ్ రెడ్డిలు కృషి ఉంటుందన్నారు.గతంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఈ వికలాంగుని పరిస్థితిని చూసి గమనించిన ఎంపీ ఇతనికి ట్రై సైకిల్ ఇస్తామని చెప్పిన హామీ ఇచ్చారన్నారు.అంతేకాకుండా గతంలో పేద మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ కూడా చేశారన్నారు.ఇలాంటి ఎన్నో సేవా కార్యక్రమాలు తమవంతుగా నియోజకవర్గంలో చేస్తూ పేదలకు భరోసాగా నిలుస్తుందంటే కేవలం పెద్దిరెడ్డి కుటుంబమేనన్నారు.ఈ కార్యక్రమంలో సచివాలయ కన్వీనర్లు కంచి కళ్యాణ్ కుమార్ రెడ్డి,జీవి రామకృష్ణ,వరప్రసాద్,నాయకులు సంకు హరికృష్ణ సబ్జీ,రామకృష్ణ టైలర్,మోహన్,బాబా,సూరి తదితరులు పాల్గొన్నారు.

➡️