ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లను పట్టించుకోని సియం

Jan 19,2024 16:19 #Annamayya district
utf protest on employees problems

యుటిఎఫ్

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : ఉపాధ్యాయ, ఉద్యోగ, పెన్షనర్లను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని యుటిఎఫ్ నాయకులు ఆరోపించారు. యుటిఎఫ్ పోరుబాట లో భాగంగా ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా మొండిగా వ్యవహరిస్తున్నందుకు ఆందోళన వ్యక్తం చేస్తూ శుక్రవారం అంబేద్కర్ విగ్రహం వద్ద యుటిఎఫ్ ఆధ్వర్యంలో నోటికి నల్ల రిబ్బన్ ధరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు హరి ప్రసాద్ మాట్లాడుతూ ప్రతిపక్ష నేతగా ఉద్యోగులపై ప్రేమ కురిపించిన జగన్ మోహన్ రెడ్డి అధికారం లోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయ, ఉద్యోగుల, పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తున్నారని అన్నారు. తమకు చెల్లించాల్సిన బకాయిల గురించి అడిగితే ఉద్యమాలపై నిర్భందం ప్రయోగిస్తున్నారని అన్నారు. ఉద్యోగులకు న్యాయంగా చెల్లించాల్సిన బకాయిలను దాటవేశే వైఖరి అవలంభిస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల సొమ్మును ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడం దుర్మార్గమైన చర్యగా అభివర్ణించారు. డి.ఏ, పి.ఆర్.సి, సరెండర్ లీవ్, ఏ.పి.జి.ఎల్.ఐ, మెడికల్ రీయింబర్స్మెంట్, పదవ తరగతి పరీక్షల రెమ్యునరేషన్, సిపిఎస్ మ్యాచింగ్ గ్రాంట్ మొదలైన బకాయిలు దాదాపు రూ 18 వేల కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ చెంగల్ రాజు, జిల్లా కార్యదర్శులు వెంకట సుబ్బయ్య, రమణ మూర్తి, రెడ్డెమ్మ, జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు రమణయ్య, విశ్రాంత యుటిఎఫ్ నాయకులు ప్రతాప్, సుబ్బరాజు, భాస్కర్ రాజు, సుబ్బయ్య, రాజంపేట, పెనగలూరు, నందలూరు, పుల్లంపేట మండలాల నాయకులు నాగేంద్ర, పాపయ్య, నరసింహారావు, రమేష్, సుధాకర్, వెంకట రమణ, రామ చంద్ర, యు.వెంకట సుబ్బయ్య, సతీష్, రవిచంద్ర , ప్రసాద్, కిషోర్, విశ్వనాథ్ , శ్రీనివాసులు, సి.వెంకట సుబ్బయ్య, రఫీ, తులశమ్మ తదితరులు పాల్గొన్నారు.

➡️