మరో నామినేషన్‌ వేసిన బేబినాయన

Apr 23,2024 21:08

 ప్రజాశక్తి-బొబ్బిలి : టిడిపి బొబ్బిలి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన మంగళవారం మరో నామినేషన్‌ దాఖలు చేశారు. సోమవారం బేబినాయన రెండు సెట్ల నామినేషన్లు వేశారు. మూడో నామినేషన్‌ సెట్‌ను ఆర్‌డిఒ కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సాయిశ్రీకి అందజేశారు. ఇప్పటి వరకు బొబ్బిలి నుంచి 14 నామినేషన్లు పడ్డాయి.బి-ఫారం అందజేత .. టిడిపి అభ్యర్థిగా బేబినాయన ఆ పార్టీ అధినేత చంద్రబాబు నుంచి బి-ఫారం అందుకున్నారు. మంగళవారం బొండపల్లి సభకు వచ్చిన చంద్రబాబును బేబినాయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు చంద్రబాబు బి-ఫారం అందజేశారు. బొబ్బిలి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించాలని బేబినాయన, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజాను చంద్రబాబు కోరారు.చిన్నారులతో ముచ్చట.. మున్సిపాలిటీలోని రామన్నదొరవలసలో మంగళవారం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బేబినాయన ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన వద్దకు చిన్నారులు రావడంతో వారిని ఎత్తుకుని కాసేపు ముచ్చటించారు. బాగా చదువుకుని మంచి ప్రయోజకులు కావాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి కౌన్సిలర్‌ కె.లక్ష్మి, నాయకులు కె.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

➡️