సజావుగా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు 

ఎన్నికల ఏర్పాట్లును పరిశీలిస్తున్న అల్లూరి జిల్లా కలెక్టర్‌ విజయ సునీత

అల్లూరి జిల్లా కలెక్టర్‌ విజయ సునీత

ప్రజాశక్తి-రంపచోడవరం

మే 13న సజావుగా ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ యం.విజయ సునీత పేర్కొన్నారు. స్థానిక గిరిజన సంక్షేమ శాఖ బాలికల స్కూల్లో ఏర్పాటు చేసిన పోస్టల్‌ బ్యాలెట్‌ పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌, రంపచోడవరం నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి యస్‌.ప్రశాంత్‌ కుమార్‌. చింతూరు ఐటిడిఎ పిఒ కావూరి చైతన్య మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విజయ సునీత మాట్లాడుతూ రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వేయడానికి 7 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పటివరకు ఈ పోలింగ్‌ కేంద్రాలలో ఓటింగ్‌ సరళి ఏ విధంగా ఉన్నదీ ఆమె ఆరా తీశారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఉన్న ప్రతి ఉద్యోగి నిర్భయంగా వారికి నచ్చిన అభ్యర్థులకు ఓటు వేయాలని సూచించారు. ఎవరికైనా ఎన్నికల విధులపై సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం ఈవీఎంలు, వివి ప్యాడ్ల భద్రత స్ట్రాంగ్‌ రూమును ఆమె పరిశీలించారు. కలెక్టర్‌ వెంట తహశీల్దార్లు ఏవి.రమణ, చలపతిరావు, ఎ.కృష్ణజ్యోతి, సత్యనారాయణ, సత్య సులోచన, డిప్యూటీ తహశీల్దార్లు బి.రాజు, స్వామి, బాలాజీ, ఎ సత్యనారాయణ, వీరభద్రరావు, రవీంద్రబాబు, సరిత, విశ్వనాథ్‌, శ్రీధర్‌, శివ, సీనియర్‌ అసిస్టెంట్లు, వీఆర్వోలు పోలింగ్‌ అధికారులు ఉన్నారు.

➡️