గ్రామీణ క్రీడాకారులను వెలికితీసేందుకే ఆడుదాం ఆంధ్ర

Nov 29,2023 16:37 #Kurnool
atadukundam andhra

ప్రజాశక్తి-ఆస్పరి : గ్రామీణ ప్రాంతాలలోని క్రీడాకారులను వెలికి తీసేందుకే ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని చేపట్టిందని ఎంపిడిఓ రాణేమ్మ అన్నారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. 15 సంవత్సరాలపై బడి ఆసక్తి ఉన్న యువతి, యువకులు గ్రామ వార్డు సచివాలయం, గ్రామ వాలంట్రిల, 1902 ద్వారా తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ క్రీడలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. డిసెంబర్ 15 నుండి ఫిబ్రవరి 3 వరకు కొనసాగుతుందన్నారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో నియోజకవర్గ స్థాయిలో గెలిచిన క్రీడకారులకు 35 వేలు, 15వేలు, 5వేలు, జిల్లాస్థాయిలో గెలిచిన క్రీడకారులకు 60వేలు, 30వేలు, 10వేలు, రాష్ట్రస్థాయిలో గెలిచిన క్రీడకారులకు 5లక్షలు, 3లక్షలు, 2లక్షలు నియోజకవర్గ స్థాయిలో బ్యాడ్మింటన్ గెలుపొందిన క్రీడకారులకు 20 వేలు, 10వేలు, 5వేలు, జిల్లాస్థాయిలో గెలిచిన క్రీడకారులకు 35వేలు, 20వేలు, 10వేలు, రాష్ట్రస్థాయిలో గెలిచిన క్రీడకారులకు 2లక్షలు, 1లక్షలు, 50వేలు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.

➡️