గుమ్మిలేరులోని స్కూల్‌లో పురస్కార గ్రహీతలకు సన్మానం

Jan 30,2024 13:11 #Awards, #felicitated, #Gummileru, #Winners

ప్రజాశక్తి – ఆలమూరు (తూర్పు గోదావరి) : మండలంలోని గుమ్మిలేరు ఎంపీపీ యుపి స్కూల్‌ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఉత్తమ పురస్కార అవార్డులు అందుకున్న మండల విద్యాశాఖ అధికారి పి.సాలెం రాజు, గుమ్మిలేరు సర్పంచ్‌ గుణ్ణం రాంబాబులకు మంగళవారం ఘన సన్మాన కార్యక్రమాన్ని ప్రైమరీ తరగతుల ఉపాధ్యాయుడు కోటిపల్లి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ … గ్రామ అభివఅద్ధికి ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తూ విద్యార్థులకు అండదండలుగా ఉంటున్న సర్పంచ్‌ రాంబాబుకి ఉత్తమ పురస్కార అవార్డు దక్కడం చాలా అభినందనీయమని కొనియాడారు. అదేవిధంగా మండల విద్యాశాఖ అధికారి సాలెం రాజుకి జిల్లా స్థాయిలో ఉత్తమ పురస్కార అవార్డు ఇవ్వడం చాలా సంతోషదాయకమన్నారు. స్కూల్‌ అభివఅద్ధికి పాటుపడుతూ, మెరుగైన విద్యా విధానాలతో సేవలందిస్తూ స్కూల్‌ ఉన్నతికి పాటుపడుతున్నారని కొనియాడారు. అలాగే విద్యార్థులలో టాలెంట్‌ గుర్తించి వారికి ప్రోత్సాహకాలు , ఐడెంటి కార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధమ ఉపాధ్యాయురాలు కే వి బి ఎల్‌ పద్మావతి, ఉపాధ్యాయులు శైలజ రాణి, కనకదుర్గ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

➡️