విద్యార్థులకు ప్ర్రోత్సాహకాలు ప్రదానం

Jun 25,2024 22:38
ఫొటో : నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్న దృశ్యం

ఫొటో : నగదు ప్రోత్సాహకాలు అందజేస్తున్న దృశ్యం
విద్యార్థులకు ప్ర్రోత్సాహకాలు ప్రదానం
ప్రజాశక్తి-మర్రిపాడు : మండలంలోని చుంచులూరు ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం జరిగిన పదవ తరగతి ఫలితాలలో మొదటి మూడు స్థానాలు సాధించిన కలిశెట్టి జ్ఞాపిక, ఇందూరు లక్ష్మీ ప్రసన్న, పవన్‌ కళ్యాణ్‌లకు వేమన ఓబయ్య, జయ రత్నమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు శ్యాంప్రసాద్‌, వెంకట సురేష్‌, కృష్ణకిషోర్‌లు రూ.10వేలు, రూ.7500, రూ.5వేల వంతున నగదు బహుమతులు పంపిణీ చేశారు. అనంతరం వేమన వెంకట సురేష్‌ కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీ గౌరవ గవర్నర్‌గా ఎంపికైన సందర్భంగా కేకు కోసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌ మాట్లాడుతూ దాతలు ముందుకు వచ్చి విద్యార్థులను ప్రోత్సహించడం శుభపరిణామన్నారు. పాఠశాలలో పదవ తరగతి వరకు చదువుకొని ప్రస్తుతం కెనడాలోని అల్బెర్టా యూనివర్సిటీలో గౌరవ గవర్నర్‌గా పదవిని అలంకరించిన వెంకట సురేష్‌కు అభినందనలు తెలియజేశారు. నగదు ప్రోత్సాహకాలు అందజేసిన వేమన కుటుంభ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేశారు. వేమన శ్యామ్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా విద్యాదానం గొప్పదని, చదువులో ముందంజలో ఉండే విద్యార్థులకు సహకారాన్ని అందించడానికి తాము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటామని, ఈ పాఠశాల అభివృద్ధికి తమ సహాయ సహకారాలు ఎప్పటికీ ఉంటాయన్నారు. కార్యక్రమంలో విశ్రాంత మండల విద్యాశాఖాధికారి జొన్నా సత్యనారాయణ, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కలిశెట్టి వెంకట రమణయ్య, కలిశెట్టి రాజేంద్రకుమార్‌, వనం నరసింహులు, ఉపాధ్యాయులు డీ.వీ.రమణయ్య, అశోక్‌, పెంచలరావు, మల్లిఖార్జున స్వామి, శివ శంకరయ్య, చైతన్య, మురళీకృష్ణ, సయీం, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

➡️