ఓటింగ్ యంత్రాలపై అవగాహన

Dec 23,2023 14:31 #ntr district

ప్రజాశక్తి-గంపలగూడెం(ఎన్‌టిఆర్‌) : జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రజలకు ఓటింగ్ యంత్రాలపై మండల వ్యాప్తంగా, అవగాహన కల్పిస్తున్నారు. రెవెన్యూ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం శనివారం పెనుగొలను పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు అయింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగీత లలిత కుమారి తో పాటు ఓటర్లు పాల్గొని ఓటింగ్ యంత్రాలను (ఈవీఎంలు) పరిశీలించారు. ఓటు ఎలా పోటీ ఎలా వేయాలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రోగ్రాం ఇంచార్జ్ ఏ ఎస్ ఓ అక్బర్ భాష, వీఆర్వో శ్రీధర్ పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పక్కనే ఉన్న ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థిని విద్యార్థులు ఈ కార్యక్రమం వద్దకు వచ్చి ఆసక్తిగా ఓటింగ్ యంత్రాలను పరిశీలించి, అధికారులను అడిగి తెలుసుకున్నారు.

➡️