కంప్యూటర్స్ లో నూతన ఆవిష్కరణలు చేయాలి

Dec 2,2023 16:22 #Kakinada
awareness on computer skills

జేఎన్టీయూకే కంప్యూటర్ సైన్స్ విభాగం డైరెక్టర్ కృష్ణ మోహన్
ప్రజాశక్తి – తాళ్లరేవు : కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ లో నూతన ఆవిష్కరణలు చేయాలని ఆ దిశగా ప్రతి విద్యార్థి పయనించాలని జేఎన్టీయూకే కంప్యూటర్ సైన్స్ విభాగం డైరెక్టర్ ఏ.కృష్ణ మోహన్ అన్నారు. పటవల లోని పైడా గ్రూప్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో నూతనముగా నిర్మించిన సెమినార్ హాల్ ను ఆయన ప్రారంభించి, జరిగిన సెమినార్లో మాట్లాడారు. ఈ సందర్భంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగం తరుపున జాతీయ స్థాయిలో రీసెంట్ ట్రెండ్స్ అండ్ టెక్నాలజీస్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అనే అంశము మీద వర్కుషాప్ నిర్వహించారు. దీనిలో భాగంగా కృష్ణమోహన్ విద్యార్థులును ఉద్దేశించి మాట్లాడుతూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎక్కువ మంది ఉన్నత శ్రేణిలో జీతం, విలాసవంతమైన జీవితాన్ని అనుభవించడానికే ఈ కోర్స్ ని ఎంచుకుంటున్నారని అది కేవలం ఒక ఆలోచన మాత్రమే అన్నారు. రాబోయే 40 నుండి 50 ఏళ్ల వరకు సమాజానికి ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు దిశగా ఆలోచించాలని అప్పుడే చదువుకు సార్ధకత చేకూరుతుంది అని అన్నారు. ఇంజి నీరింగ్ లో మిగిలిన కోర్సులకు లేని ఎన్నో అవకాశాలు కంప్యూటర్ సైన్స్ విద్యార్థులకు మాత్రమే ఉన్నాయని తెలిపారు. విద్యార్థులు పరిశోధనల దిశగా ముందడుగు వేయాలని సూచించారు. సెక్రటరీ శ్రీరామ్ మాట్లాడుతూ విద్యార్థులు వివిధ రకాల నైపుణ్యాలను అభివృద్ధి చేసుకో వాదానికి ఆధునాతన సౌకర్యాలతో సెమినార్ హాల్ ను నిర్మించామని అన్నారు. యాజమాన్యం తరుపున కృష్ణమోహన్ ని దుస్సాలువతో ఘనంగా సన్మానించి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిధిగా వెళ్ళూరు ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ బీ.ఎన్. జగదీశ్ విచ్చేసి విద్యార్థులతో మాట్లాడారు. నేటి విద్యా విధానం కేవలం ర్యాంకులు కోసం అన్నట్లుగా ఉందని, పాఠ్యంసాలను లోతుగా అవగాహనతొ నేర్చుకోవాలని అన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాలకు ధీటుగా మన తరాల భవిష్యత్తు మార్చే శక్తి సామర్ధ్యాలు యువతలో ఉన్నాయని సూచించారు. ప్రపంచ దేశాలు భారత యువత నైపుణ్యాలతో వారి లక్ష్యాలను చేరుకుంటున్నారని, రాబోయే సంవత్సరాలలొ ఈ పరిస్థితి మార్చాలనే దిశగా అడుగులు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ సూర్యప్రకాష్, వైస్ ప్రిన్సిపాల్ రవికుమార్, డీన్ .వీరభద్ర రావు, డీ.డీ.రవీంద్ర రెడ్డి, ప్రసాద్, అధ్యాపకులు రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️