ఓటింగ్‌ పెంచేందుకు అవగాహనా కార్యక్రమాలు

Apr 27,2024 21:48

ప్రజాశక్తి-విజయనగరం కోట : జిల్లాలో ఓటింగ్‌ శాతాన్ని పెంచడం, శతశాతం ఓటింగ్‌ నమోదు చేయించే దిశగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ నాగలక్ష్మి ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్వీప్‌ కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్య పరిచేందుకు కషి చేస్తున్నారు. ఇప్పటికే పింఛన్‌ దారులు, వికలాంగులు, హిజ్రాలు, యువత కోసం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఓటు గొప్పదనాన్ని వివరిస్తూ కలెక్టరేట్‌ వద్ద సెల్ఫీ పాయింట్‌ ఏర్పాటు చేసారు. మోడల్‌ పోలింగ్‌ బూత్‌ ఏర్పాటు చేసి, ఓటింగ్‌ ప్రక్రియపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు కషి చేస్తున్నారు. ఫ్లాష్‌ మాబ్‌ ద్వారా పెద్ద ఎత్తున యువతను ఆకర్షించి, ఓటు వేయడం పౌరుల బాధ్యతగా ఉద్బోధించారు. స్వీప్‌ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు, ప్రచార కార్యక్రమాన్ని ఉధతం చేసేందుకు గాను ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్లను శనివారం తన ఛాంబర్లో కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ గోడపత్రికలను అన్ని సచివాలయాల్లో, ఆర్టీసి బస్సుల్లో, గ్రామాల్లో అంటించి ఓటర్లలో అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, స్వీప్‌ నోడల్‌ అధికారి, హౌసింగ్‌ పీడీ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️