రోగులకు అవగాహన సదస్సు

ప్రజాశక్తి-యర్రగొండపాలెం: యర్రగొండపాలెం పట్టణంలోని రవీంద్ర ఉదరు సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాలలో వరల్డ్‌ హైపర్‌ టెన్షన్‌ డే సందర్భంగా గ్లెన్‌మార్క్‌ కంపెనీ ఆధ్వర్యంలో అక్కడి ప్రజలకు, రోగులకు రక్తపోటుపై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్‌ మన్నె రవీంద్ర మాట్లాడుతూ ఉరుకులు, పరుగుల జీవన శైలి కారణంగా చాలా మంది ఒత్తిడికి గురవుతున్నా రని చెప్పారు. రక్తపోటు, మధుమేహం, ఇతర వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. పనిలో శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువగా ఆలోచించడం, కూర్చున్న చోటనే పనిచేయడం తో ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదురవుతా యన్నారు. బరువు పెరిగి అనేక వ్యాధులకు గురవుతున్నారని చెప్పారు. 30 సంవత్సరాలు దాడిన వాళ్లు ఎక్కువగా బీపీ బారిన పడుతున్నారని తెలిపారు. సరైన వ్యాయామం చేయడంతో పాటు మంచి ఆహారపు అలవాట్లు నెరవేర్చుకుంటే ఈ ముప్పు నుంచి బయట పడవచ్చునని తెలిపారు. ప్రధానంగా ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలన్నారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సందీప్‌, డాక్టర్‌ పిఎల్‌ నారాయణరెడ్డి, గ్లేప్‌ మార్క్‌ డివిజనల్‌ మేనేజర్‌ పి అస్లాం ఖాన్‌, ఫీల్డ్‌ సేల్స్‌ ఆఫీసర్‌ ఐ ప్రదీప్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️