భక్తిశ్రద్ధలతో బక్రీద్‌

పరవాడ మండలంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లిములు

విశాఖ కలెక్టరేట్‌ :

దక్షిణ నియోజకవర్గం పరిధిలోగల కోటవీధి ఈద్‌ గాV్‌ా వద్ద సోమవారం బక్రీద్‌ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్‌ సాముహిక నమాజ్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్యాగం, సహనం బక్రీద్‌ అందించే సందేశమన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో మెలగాలన్నారు. నమాజ్‌ అనంతరం ఒకరికి ఒకరు ఆలింగనం చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు.పరవాడ : మండలంలోని పరవాడ, ఎన్టీపీసి, చీపురుపల్లి, గొల్లగుంట తదితర గ్రామాల్లో బక్రీద్‌ పండుగను సోమవారం ముస్లిములు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం ఊరేగింపుగా మసీదులు, ఈద్గాల వద్దకు వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. గొల్లగుంట మసీదులో పెద్దలు, మతగురువులు ప్రత్యేక ప్రార్థనల అనంతరం ధార్మికో ఉపన్యాసం చేశారు. త్యాగ నిరతికి బక్రీద్‌ పండుగ నిదర్శనమని అన్నారు. ఈ సందర్భంగా ముస్లిములు ఒకరికొకరు ఈద్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.

➡️