బానాది కాజ్‌వే నిర్మించరా.?

May 25,2024 20:18

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని ఆతవ, బాణాది గ్రామాల మధ్య గల గెడవల్ల వర్షాకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ గెడ్డపై కాజ్‌వే నిర్మిస్తామని గతంలో నాయకులు చెప్పినా అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఐదు గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో గెడ్డ నుంచి నీరు రోడ్డు మీదుగా ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. మనుషులు, పశువులు కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు. బానాది గ్రామానికి చెందిన రైతులు గెడ్డ అవతల ఉన్న కల్లాలకు వెళ్లాలంటే ప్రవాహానికి అవతలికి వెళ్లలేక అవతల ఉన్నవారు, గ్రామానికి చేరుకోలేక రెండు మూడు రోజులు కల్లాల వద్దనే తిండికి కూడా ఇబ్బంది పడి ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో బానాది గ్రామ సర్పంచ్‌గా పనిచేసిన గొంప వెంకటరావు ఆతవ గ్రామం నుంచి బానాది గ్రామానికి రోడ్డు వేయాలన్నా తపనతో ఉపాధి హామీ నిధులతో ఆతవ గ్రామం నుంచి బానాది మెట్టు భూముల వరకు మెటల్‌ రోడ్డు వేయించారు. సుమారు ఈ రోడ్డు రెండు కిలోమీటర్ల వరకు ఉంటుంది. మరో అరకిలోమీటర్లు రోడ్డు వేసి కాజ్‌వే నిర్మిస్తే ఐదు గ్రామాల ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఉంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. ఐదు గ్రామాల రాకపోకలకు అంతరాయంవర్షం పడితే ఈ గెడ్డ నుంచి రోడ్డుపైగా నీరు ఉధృతంగా ప్రవహించిడంతో ఐదు గ్రామాలు సింగరాయి, ఆతవ, బాణాది, ఏం సింగవరం, బల్లంకి ప్రజలు రాకపోకలకు అంతరాయం ఏర్పడి తీవ్రంగా ఇబ్బందులు పడతారు. రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేస్తే ప్రయాణానికే కాకుండా, రైతులు పండించే వివిధ రకాల పంటలు కూడా వారి కల్లాలకు గ్రామాలకు చేర్చుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ విషయం గతంలో టిడిపి, వైసిపికు చెందిన ఎమ్మెల్యేలకు చెప్పినా కనీస స్పందన లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు పదవులు చేపట్టిన తర్వాత ఇచ్చిన మాట నిలుపుకోలేని ప్రజాప్రతినిధులు తమకెందుకని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. అసంపూర్తిగా ఉన్న రోడ్డు నిర్మాణం, కాజ్‌వే నిర్మాణం పనులు పూర్తి చేస్తే ఆనందపురం వెళ్లడానికి సుమారు ఆరు కిలోమీటర్లు ప్రయాణం తగ్గుతుంతనా ప్రభుత్వం ఎందుకు ఆ దిశగా ప్రయత్నం చేయడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఈ రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేసి కాజ్‌వే నిర్మాణం చేపట్టి ఐదు గ్రామాలు ప్రజలు కష్టాలు తొలగే విధంగా ఐదు గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.కాజ్‌వే నిర్మాణంతోనే కష్టాలు తీరేది బానాది గెడ్డ వద్ద కాజువే నిర్మాణం చేపడితేనే కష్టాలు తీరేది. కాజ్‌వే నిర్మాణ పనులకు నిధులు మంజూరు చేసి పనులు పూర్తి చేస్తే బానాది గ్రామ ప్రజలతోపాటు సుమారు 5 గ్రామాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బందులు తొలగిపోతాయి. వర్షాకాలంలో రైతులకు కష్టాలు కూడా తగ్గుతాయి. ప్రభుత్వం మానవతా దృక్పథంతో నిధులు మంజూరు చేయించి రాకపోకలకు ఆటంకం లేకుండా తగు చర్యలు తీసుకోవాలి. గొంప తులసి, ఎంపిటిసి బానాదిఏ చిన్న పని ఉన్నా గెడ్డ దాటాల్సిందే మాకు ఏ చిన్న పని ఉన్నా బానాది గ్రామం వెళ్లాల్సిందే. వర్షాకాలం వస్తే గెడ్డ ప్రవాహం ప్రమాదకరంగా ఉంటుంది. నాలుగు ఐదు రోజులు ఏకధాటిగా వర్షాలు పడితే రాకపోకలు సాగించలేం. బజారుకు కిరాణా సామాన్లు కావాలంటే బానాది వెళ్లాలి. లేదంటే అనందపురం వెళ్ళాలి. ఎటు వెళ్లాల్సి వచ్చినా పెద్ద గెడ్డ దాటాల్సిందే. వర్షాకాలంలో గెడ్డ దాటాలంటే భయపడాల్సిందే. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి గెడ్డపై కాజ్‌వే పనులు పూర్తి చేసి సింగరాయి, ఆతవ గ్రామాల ప్రజలకు బాణాది బల్లంకి ఆనందపురం మీదుగా రవాణా సౌకర్యం కల్పించాలిసిరికి రమణ, గ్రామ పెద్ద ఆతవ.

➡️