బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కు డీజీపీ డిస్క్‌ గోల్డ్‌ మెడల్‌

బాపట్ల : బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ కు డీజీపీ డిస్క్‌ గోల్డ్‌ మెడల్‌ దక్కింది. ఈ విషయాన్ని బుధవారం ఎస్పీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో శాంతిభద్రతల విభాగంతో పాటు దిశ, కన్విక్షన్‌ బేస్డ్‌ పోలీసింగ్‌ లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ఐపిఎస్‌ కు డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ డిజిపి డిస్క్‌ అవార్డు బంగారు మెడల్‌ ను పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో డీజీపీ రాజేంద్రనాథ్‌ రెడ్డి అందించనున్నారు. జిల్లా కు చెందిన మరో 8 మందికి డిజిపీస్‌ బ్రాంజ్‌ డిస్క్‌ అవార్డు దక్కింది.

➡️