టిడిపిలో చేరిన ఎస్‌సిలు

Jan 17,2024 23:41

ప్రజాశక్తి – చెరుకుపల్లి
స్థానిక ఎస్సీ కాలనీ చెందిన పలువురు కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ సమక్షంలో టిడిపిలో చేరారు. వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎస్సీ కాలనీవాసులు పెద్దపల్లి లీలా కృష్ణ, అనిత, రాజేష్, కుమారి, బడుగు సామియేల్, కుమారి, నాదెళ్ల యేసుబాబు, శైలజ, బడుగు సమర్పణరావు, శివమణి, వంశీ, మరియమ్మ, పెద్దపల్లి శివకృష్ణ, భాగ్యలక్ష్మి, రాజారావు, సుధారాణి వైసిపీ నుండి టిడిపిలో చేరారు. కార్యక్రమంలో మండల నాయకులు నాగుల పున్నారావు, ఎంఆర్‌కె మూర్తి, పి కుమారస్వామి పాల్గొన్నారు.

➡️