నిరుపేదలకు ఉచిత మెగా వైద్యశిభిరం : వైద్య శిబిరాన్ని ప్రారంభిస్తున్న రెబ్బ ఇమ్మానియేల్

Jan 17,2024 23:48

ప్రజాశక్తి – రేపల్లె
ఉచిత వైద్యసేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఇండియన్ రూరల్ ఇవాంజికల్ ఫెలోషిప్ విద్యాసంస్థల అధినేత బిషప్ రెబ్బ ఇమ్మానియేల్ అన్నారు. తమ ఫెలోషిప్ ఆధ్వర్యంలో పేదల కొరకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. శిబిరంలో ఐఆర్ఈఎఫ్ సహకారంతో 20మంది అమెరికన్ డాక్టర్లతో రూరల్ లంకెవానిదిబ్బ గ్రామంలో 500కుపైగా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఇమ్మానియేల్ మాట్లాడుతూ తీర ప్రాంత ప్రజల సౌకర్యార్థం క్యాంపు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిరుపేదలున్న ప్రాంతంలో వైద్య శిభిరం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. వైద్య శిబిరంలో 18రకాల రక్త పరీక్షలు, బీపీ, షుగర్, గైనకాలజీ, ఆర్థో, ఈసీజి, ఈఎంటీ, దంత పరీక్షలు, కంటి పరీక్షలు, ఎక్సరే అవసరమైన వారికి ఉచిత కళ్ళజోడులు, ఉచిత మందులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఇలాంటి అన్ని రకాల వైద్య సేవలు ఒకే చోట ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పేద ప్రజలు ఈ ఉచిత వైద్య సేవలు వినియోగించుకోవడం అభినందనీయం అన్నారు. ఆరోగ్యం వ్యాపారంగా మారిన నేటి రోజుల్లో సామాజిక దృక్పథంలో పేదవారికి వైద్య సేవలు అందాలనే లక్ష్యంతో ఫెలోషిప్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ ప్రాంత నిరుపేదలకు నాణ్యమైన వైద్యం, ఉచిత మందులు అందించడమే కాకుండా వారి గడప వద్దకు చేరుకోవాలనే లక్ష్యంతో వైద్య శిబిరాన్ని ఐఆర్ఇఎఫ్ నిర్వహించిందని అన్నారు. 500మంది నిరుపేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

➡️