పర్యావరణాన్ని కాపాడుదాం

Dec 29,2023 00:24

ప్రజాశక్తి – బల్లికురవ రూరల్
రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో జెడ్‌పి ఉన్నత పాఠశాల్లో పిజిఎన్‌ఎఫ్‌, ఎఫర్ట్‌ సహకారంతో 60మొక్కలు నాటారు. రోటరీ అధ్యక్షులు తాళ్లూరి సాంబశివరావు మాట్లాడుతూ పర్యావరణానికి చెట్లు ఎంతో దోహదపడతాయని అన్నారు. మనకు కావలసిన ఆహారాన్ని అందిస్తూ ఆక్సిజన్‌ కూడా ఇస్తామని అన్నారు. ఓజోన్ పొర రక్షణ, వర్షాలతోపాటు చల్లని వాతావరణాన్నీ ఇస్తాయని అన్నారు. మందులు, వనమూలికలను ఇస్తాయని చెప్పారు. భవిష్యత్తు తరాలు ఆరోగ్యంగా ఉండాలంటే చెట్లు పెంచి పర్యావరణం కాపాడాలని కోరారు. కార్యక్రమంలో రోటరీ మాజీ అధ్యక్షులు జాష్టి సాంబశివరావు, గరిమిడి శ్రీనివాసరావు, మాదాల సాంబశివరావు, మల్లినేడి గోవిందరావు, ధూళిపాళ్ల వీరాంజనేయులు, మద్దుమాల కోటేశ్వరరావు, కార్యదర్శి చెరుకూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.

➡️