ఈనెల 14 న యానాదుల శంఖారావం

Feb 8,2024 23:00

ప్రజాశక్తి – కర్లపాలెం
ఈ నెల 14 తేదీన స్థానిక ఆర్యవైశ్య కల్యాణ మండపంలో యానాదుల రాష్ట్ర మహాసభ జరుగ నున్నదని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి అన్నారు. స్థానిక వాసవి ఆర్యవైశ్య కల్యాణ మండపంలో గురువారం కరపత్రం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 76ఏల్లు అయినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని అన్నారు. నేటికి యానాదులకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేవంటే అధికారులు, ప్రజాప్రతినిధుల అసమర్ధత అర్ధం అవుతుందని అన్నారు. కార్యక్రమంలో యానాది సంఘాల మహా కూటమి చీఫ్ అడ్వైజర్ ఈగ శ్రీనివాసరావు, అధికార ప్రతినిధి యాకశిరి నరసింహారావు, కోశాధికారి బెల్లంచర్ల ప్రసాద్, రాష్ట్ర ఉపాధ్యక్షులు రావూరి శ్రీనివాసరావు, తుమ్మా కొండలు, గోసాని తిరుపతమ్మ, గోసాని రాంబాబు, జి అరుణ, జీవన్ బాబు, కోనేటి సుందరమ్మ, తలపల జీవన్ బాబు పాల్గొన్నారు.

➡️