కోడి కత్తుల కలకలం

Dec 29,2023 00:05

ప్రజాశక్తి – వేటపాలెం
గ్రామంలో కోడి కత్తుల కలకలం రేగింది. 133కత్తులను పోలీసులు గురువారం స్వాధీనం చేసుకున్నారు. మండలంలోని అక్కయ్యపాలెం పంచాయతీ లక్ష్మీపురంలో మందలపు పిచ్చయ్య కోడి పందెం రాయుళ్లకు కత్తులను విక్రయిస్తూ ఉంటాడు. విశ్వాసనీయ సమాచారం మేరకు ఎస్‌ఐ జి సురేష్ తనిఖీలు చేశారు. తనిఖీలలో అతని ఇంటిలో 133కోడి కత్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మండలంలోని శ్రీ కనక నాగవరపు అమ్మ గుడి పరిసరాలలో కోడిపందెం రాయిళ్లను ఎస్సై మూడురోజుల క్రితం అరెస్టు చేశారు. నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు దాడులు చేశారు.

➡️