పూర్వవిద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Mar 4,2024 00:21

ప్రజాశక్తి – భట్టిప్రోలు
మండల కేంద్రమైన భట్టిప్రోలు ఉన్నత పాఠశాల్లో 1973 – 74 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పాఠశాల్లో నిర్వహించారు. 50ఏళ్లు పూర్తి చేసుకున్న అనాటి విద్యార్థులు ప్రస్తుతం వివిధ రంగాల్లో ఉద్యోగాలు చేసేవారు కొందరుండగా మరికొందరు ఉద్యోగ విరమణ చేశారు. 70మంది 10వ తరగతి విద్యార్ధుల్లో ప్రస్తుతం 50మందికిపైగా జీవించి ఉండగా మరికొందరు అనారోగ్య కారణాలు, వృద్ధాప్య కారణాలతో మృతి చెందినప్పటికీ ప్రస్తుతం ఉన్నవారైనా ఏఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్లందర్నీ కలుసుకొని ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకునేందుకే ఈ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసినట్లు విశ్రాంత ఉపాధ్యాయులు బొలిశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. ఒకరికొకరు పరిచయాలను గుర్తు చేసుకుంటూ ప్రస్తుత స్థితిగతులు, కుటుంబ పరిస్థితులు, వారి జీవనశైలి వంటి వివిధ రకాల అంశాలను ఆత్మీయంగా పలకరించుకొని ఆనందాలను పంచుకున్నారు. కార్యక్రమంలో హెచ్ఎం శ్రీరామ కోటేశ్వరరావు, కరస్పాండెంట్ మల్లికార్జునరావు, సూరేపల్లి ఉన్నత పాఠశాల విశ్రాత హెచ్ఎం రామనాథం రామకృష్ణ పాల్గొన్నారు.

➡️