సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దివ్యాంగుల సర్వే

May 23,2024 22:50 ##APCPM #Battiprolu #NDA #BJP

ప్రజాశక్తి – భట్టిప్రోలు
ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మే ఒకటి నుండి జూన్ 9వరకు దివ్యాంగుల సర్వే కొనసాగుతుందని ఎంఈఓ నీలం దేవరాజ్ తెలిపారు. ఆదేపల్లిలోని భవిత కేంద్రం ద్వారా ఐఈడి ఉపాధ్యాయులు డి మేరీ ఇవాంజలింగ్, కె రత్నాకర్ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు భట్టిప్రోలు, అద్దేపల్లిలో 13 మంది నూతన దివ్యాంగులను గుర్తించినట్లు పేర్కొన్నారు. సర్వేలో గుర్తించిన దివ్యాంగులను ఆయా పాఠశాలల్లో చేర్పించేందుకు బడిబాటలో భాగంగా దీనిని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సాధారణ పిల్లలతోపాటు ప్రత్యేక అవసరాలు కలిగిన వారిని విద్యకు దగ్గరగా తీసుకొచ్చేందుకు ఈ సర్వే దోహదపడుతుందని అన్నారు. ప్రజలు సిబ్బందికి సహకరించాలని కోరారు. అనంతరం దివ్యాంగ విద్యార్థికి ట్రై సైకిల్‌ను బహకరించారు. కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు.

➡️