మద్యంతరంగా ముగిసిన పాదయాత్ర

Jan 26,2024 00:00

ప్రజాశక్తి – వేటపాలెం
జనసేన ఇన్‌ఛార్జి ఆమంచి శ్రీనివాసరావు (స్వాములు) మహా పాదయాత్ర పేరుతో గురువారం చేపట్టిన పాదయాత్ర మధ్యలోనే ముగించారు. పందిళ్ళపల్లిలోని తన ఇంటి నుండి దేశాయిపేట జనసేన కార్యాలయం వరకు పాదయాత్ర ఉంటుందని ప్రకటించారు. ప్రజల సమస్యలు తెలుసుకునే విధంగా కొనసాగుతుందని చెప్పారు. అయితే అలాంటివి ఏమీ లేకుండానే పందిళ్లపల్లి నుండి వేటపాలెం గడియార స్తంభం సెంటర్ వరకు కొనసాగింది. వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు అనంతరం ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అనంతరం మద్యాహ్న సమయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఓపెన్ టాప్ కారులో దేశాయిపేట జనసేన కార్యాలయం వరకు ప్రజలకు అభివాదం చేస్తూ కొనసాగింది. పాదయాత్రకు ఎలాంటి అనుమతి లేదని, ముందస్తుగా 30యాక్ట్ అమలులో ఉన్నట్లు వేటపాలెం పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు.

➡️