మద్యం అక్రమంగా వికరిస్తే చర్యలు

Mar 7,2024 00:26

ప్రజాశక్తి – కారంచేడు
మద్యం అక్రమంగా విక్రయిచే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ కె సురేష్ హెచ్చరించారు. కారంచేడు గ్రామంలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న ప్రాథమిక సమాచారంతో తన సిబ్బందితో కలిసి బుధవారం దాడులు చేశారు. గ్రామంలో అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకొని 10మద్యం బాటిల్లను స్వాధీన చేసుకున్నారు. మండలంలో నిషేధిత వస్తువులు, అక్రమ మద్యం, ఇసుక రవాణా వంటి అక్రమాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

➡️