కొవ్వొత్తులతో అంగన్‌వాడీ కార్యకర్తల నిరసన

Dec 25,2023 02:36

ప్రజాశక్తి – చీరాల
అంగన్‌వాడీ కార్యకర్తల న్యాయమైన సమస్యలును పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వం చోద్యం చూస్తూ అంగన్‌వాడీ కేంద్రాల తాళాలను సచివాలయ సిబ్బందితో పగలగొట్టడం చట్ట విరుద్ధమైన చర్యని సిఐటియు డివిజన్ కార్యదర్శి వసంతరావు అన్నారు. అంగన్‌వాడీల నిరసన దీక్షలు ఆదివారం నాటికీ 14వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా పట్టణంలోని స్థానిక బస్టాండ్ వద్ద క్రొవ్వొత్తులతో నిరసన ర్యాలీ చేశారు. కొద్ది సేపు ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా సీఐటీయూ కార్యదర్శి ఎం వసంతరావు మాట్లాడుతూ తెలంగాణ కంటే అదనంగా వేతనం పెంచుతామని గతంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు. అంగన్‌వాడీ లేమీ గొంతెమ్మకోరికలు కోరడం లేదని అన్నారు. సమస్య పరిష్కారం చేయకుండా జగన్ ప్రభుత్వం సమ్మె విచ్చిన్నానికి పూనుకోవటం వాంఛనీయం కాదని అన్నారు. మహిళా సాధికారత అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించాలని కోరారు. కార్యక్రమంలో నిర్మల, ఝాన్సీ, మేరీ, సాగరిక పాల్గొన్నారు.

➡️