బాధ్యతలు స్వీకరించిన పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు

Mar 2,2024 23:35

ప్రజాశక్తి – పంగులూరు
గ్రామ సచివాలయ పరిధిలో ఉండే పశువైద్యశాలలో యానిమల్ హస్బెండ్ ఉద్యోగులు శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వ చేపట్టిన ఉద్యోగ నియామకాల్లో ఎంపికైన అభ్యర్థులు శనివారం తమ కేటాయించిన సచివాలయాల్లో చేరారు. స్థానిక ఎంపిడిఒ కె మ్యాత్యూ బాబుకు తమ నియామక పత్రాలను అందజేసి విధుల్లో చేరారు. మండలంలో 14సచివాలయాలు ఉండగా ఇప్పటివరకు మూడు సచివాలయంలో మాత్రమే పశుసంవర్ధక శాఖ ఉద్యోగులు ఉన్నారు. మిగతా 11చోట్ల కొత్త ఉద్యోగులు వచ్చారు. ప్రస్తుతం పంగులూరు-1కు పి రమేష్, బూదవాడకు షేక్ అర్షియా, రామకూరుకు డి ప్రమీల భాయ్, కొండ మంజులూరుకు వై యశోద, తూర్పు తక్కెలపాడుకు టి వెంకట జ్ఞానేశ్వరి, ముప్పవరంకు కె మహాలక్ష్మి విధుల్లో చేరగా మరో ఐదుగురు కూడా విధుల్లో చేరాల్సి ఉంది. వీరు రైతు భరోసా కేంద్రాల అసిస్టెంట్లుగా ఉంటారని ఎంపీడీఒ తెలిపారు.

➡️