ప్రజలకు అందుబాటులో ఉంటా

Mar 7,2024 00:18

ప్రజాశక్తి – పంగులూరు
మంత్రి పదవి తనకు ముఖ్యం కాదని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటమే తనకు ముఖ్యమని ఎంఎల్‌ఎ గొట్టిపాటి రవికుమార్ అన్నారు. మండలంలోని కల్లంవారిపాలెంలో ఎన్‌టిఆర్‌ విగ్రహావిష్కరణలో ఆయన మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో టిడిపి 155సీట్లు సాధిస్తుందని చెప్పారు. టిడిపిని గెలిపిస్తే గ్రామంలో సిమెంట్ రోడ్లు, లింకు రోడ్లు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు రావూరి రమేష్ బాబు, టిడిపి నాయకులు కుక్కపల్లి ఏడుకొండలు, రామసుబ్బారావు, వలపర్ల సుబ్బారావు, చింతల సహదేవుడు పాల్గొన్నారు.

➡️