జనన మరణాల నమోదుపై అవగాహన

May 22,2024 23:02 ##chirala #cmc

ప్రజాశక్తి – చీరాల
జనన, మరణాల నమోదుకు కొత్త మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలని కమీషనరు కె చక్రవర్తి సూచించారు. స్థానిక మునిసిపల్ కార్యాలయంలో జనన, మరణ ధృవీకరణ పత్రాల జారీకి సంబంధించి 2023 అక్టోబరు 1 నుండి అమల్లోకి వచ్చిన కొత్త విధానం వచ్చిందని తెలిపారు. ప్రైవేట్ హాస్పిటల్స్ డాక్టర్లు, సిబ్బందితో ప్రత్యేక సమావేశం బుధవారం నిర్వహించారు. పునరుద్ధరించిన సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ (సిఆర్ఎస్) పోర్టల్‌పై మాట్లాడారు. కార్యక్రమంలో డాక్టర్ రామకృష్ణ హనుమాన్‌తో పాటుగా హెల్త్ అసిస్టెంట్లు, ప్రైవేట్ హాస్పిటల్స్ సిబ్బంది పాల్గొన్నారు.

➡️