పర్యావరణంపై విద్యార్థులకు అవగాహన

Feb 17,2024 00:17

ప్రజాశక్తి – బాపట్ల
పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సి బాధ్యత నేతరం విద్యార్థులపై ఉందని జాతీయ గ్రీన్ కోర్ రాష్ట్ర సంచాలకులు పి స్రవంతి అన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలలను ఆమె శుక్రవారం సందర్శించారు. వాతావరణ కాలుష్యంతో ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. దీంతో ప్రజల్లో అనేక అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయని అన్నారు. భావితరాలకు స్వచ్ఛమైన వాతావరణాన్ని కల్పించేందుకు పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కేంద్ర పర్యావరణ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పర్యావరణ విద్యా కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్దులకు శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో ఎకో క్లబ్బులను ఏర్పాటు చేసి విద్యార్థుల్లో పరిపూర్ణ అవగాహన పెంచేందుకు కృషి చేయాలని కోరారు. ప్రతి విద్యార్థికి మొక్కలు పెంచవలసిన ఆవశ్యకతపై అవగాహన కల్పించాలని అన్నారు. పట్టణంలో హోలీ క్రాస్, లిటిల్ ఏంజిల్స్, జెమ్స్ హై స్కూల్‌ను ఆమె సందర్శించారు. డిఇఒ కె నారాయణరావు సమావేశమైన ఆమె జిల్లాలో అమలౌతున్న పర్యావరణ అవగాహన కార్యక్రమాలపై చర్చించారు. కార్యక్రమంలో ఎంఈఓలు నిరంజన్, ప్రసాద్, గ్రీన్ కోర్ జిల్లా కన్వీనర్‌ పవని భానుచంద్రమూర్తి, జిల్లా సైన్స్ అధికారి మహమ్మద్ సాదిక్, ప్రాజెక్ట్ ఆఫీసర్ సత్యనారాయణ పాల్గొన్నారు.

➡️