వైసీపీకి భారీ షాక్ : ఏలూరి సమక్షంలో టిడిపిలో చేరిన వైసీపీ సర్పంచ్

Mar 8,2024 23:34

ప్రజాశక్తి – చిన్నగంజాం
పర్చూరు నియోజకవర్గంలో వైసిపికి భారీ షాక్ తగిలింది. వైసిపి నుంచి టిడిపిలోకి వలసలు పెరిగాయి. మండలంలోని మోటుపల్లి వైసిపి సర్పంచ్ వడ్లమూడి సాంబశివరావు టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎంఎల్‌ఎ ఏలూరి సాంబశివరావు సమక్షంలో టిడిపిలో శుక్రవారం చేరారు. ఆయనకు ఎంఎల్‌ఎ ఏలూరి టిడిపి కండువా కప్పి ఆహ్వానించారు. ఆయనతో పాటు మోటుపల్లికి చెందిన 72కుటుంబాలు టిడిపిలో చేరారు. సందర్భంగా ఎంఎల్‌ఎ ఏలూరి మాట్లాడుతూ నాలుగున్నరేళ్ల వైసిపి పాలనలో అన్ని ప్రభుత్వ వ్యవస్థలు ధ్వంసం అయ్యాయని అన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎక్కడా అభివృద్ధి లేదన్నారు. ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచులను వైసిపి ప్రభుత్వం ఉత్సవ విగ్రహాలుగా మార్చిందని అన్నారు. వైసీపీ సర్పంచ్లతో కూడా అభివృద్ధి పనులు చేయించిన ఘనత టిడిపిదేనని అన్నారు. బీసీలకు అండగా టిడిపి ఉందని అన్నారు. వైసిపి బీసీల జపం చేస్తూ రూపాయి కూడా ఒనగోర్చలేదని అన్నారు. టిడిపి డిఎన్ఏలో బీసీలు ఉన్నారని, బీసీల డిఎన్ఏలో టిడిపి ఉందని అన్నారు. బీసీలకు ఆత్మగౌరాన్ని ఇచ్చింది టిడిపినేనని పేర్కొన్నారు. టిడిపిని అధికారంలోకి తీసుకురావాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షులు పొద వీరయ్య, మాజీ జెడ్పిటిసి యార్లగడ్డ లక్ష్మి, టిడిపి నాయకులు నక్కల రాఘవ, వడ్లమూడి వెంకయ్య, వడ్లమూడి సత్యనారాయణ, రాయిని ఆత్మరావు, కొక్కిలిగడ్డ రాములు పాల్గొన్నారు.

➡️