ఆనందబాబుకు మద్దతుగా ప్రచారం

Apr 11,2024 01:17 ##ntr #tdp

ప్రజాశక్తి – భట్టిప్రోలు
టిడిపి అభ్యర్థి, మాజీ మంత్రి నక్క అనందబాబుకు మద్దతుగా టిడిపి శ్రేణులు బుధవారం గ్రామంలో ప్రచారం నిర్వహించారు. టిడిపి రాష్ట్ర కార్యదర్శి తోనుగుంట్ల సాయిబాబా ఆధ్వర్యంలో గడప గడపకు తిరిగి చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్‌ పథకాలను వివరిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. టిడిపి, జనసేన సంయుక్త అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నక్కాఆనందబాబు, బాపట్ల ఎంపీ అభ్యర్థి కృష్ణ ప్రసాద్‌ను గెలిపించాలని కోరారు. రాష్ట్ర భవిష్యత్తు, రాజధాని నిర్మాణం, నిరుద్యోగ సమస్య పరిష్కారానికి చంద్రబాబును గెలిపించాలని సూచించారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

➡️