వికలాంగుల సంఘం ఆధ్వర్యంలో నగదు అందజేత

Mar 7,2024 23:06

ప్రజాశక్తి – సంతమాగులూరు
మండలంలోని కొప్పరం గ్రామానికి చెందిన వికలాంగుడు షేక్ అల్లిసా కుటుంబానికి గురువారం వికలాంగుల సంఘం మండల అధ్యక్షుడు తోడేటి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో వికలాంగులు కొందరు ఆర్థిక సహాయం అందజేశారు. వికలాంగుడైన షేక్ అల్లీసాకు రెండేళ్ల క్రితం పక్షవాతం సోకడంతో మంచానికే పరిమితమయ్యాడు. కుటుంబ పోషణ జరగక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ విషయం తెలిసిన తన తోటి వికలాంగులు చలించి పోయారు. తలా కాస్త వసూలు చేసి రూ.7వేల నగదును అల్లీసా కుటుంబానికి అందజేశారు. తమను ఆర్థికంగా ఆదుకున్న తోటి వికలాంగులకు అల్లిసా కుటుంబం కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వికలాంగ సభ్యులు గురిశెట్టి ప్రభుదాసు, మిరియాల శ్రీనివాసరావు, మంచా రాంబాబు, షేక్ రసూల్, గుంజి లక్ష్మణరావు పాల్గొన్నారు.

➡️