అవగాహన లేని వ్యక్తి చంద్రబాబు 

Apr 1,2024 15:37 #Bapatla District

బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి

ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల ప్రాంత రైతు సమస్యల గురించి చంద్రబాబు కనీసం తెలుసుకోకుండా మాట్లాడారని బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మండిపడ్డారు.  చెప్పే వారికి బుద్ది లేదు. వినేవారికి అసలే లేదు. అందుకే గిట్టుబాటు ధర లేదని, కాలువల పూడిక తీత పనులు జరగలేదని, రకరకాల అబద్ధాలు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో మాట్లాడటం సిగ్గు చేటు. బాపట్ల వచ్చాను కదా, ఎదో ఒకటి మాట్లాడాలని మాట్లాడాడే తప్ప, బాపట్ల కోసం ఏం చేశాడో చెప్పలేదు.కనీసం రాష్ట్రానికి ఏం చేయగలనో కూడా చెప్పలేదు. కోన రఘుపతి గురించి ఏదో నాలుగు అబద్ధాలు, నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం చంద్రబాబు కు పరిపాటి అయింది. కండువా కప్పని వ్యక్తిని వరంగల్ నుంచి తెచ్చి బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చారు.బిజెపితో పొత్తు తోనే చంద్రబాబు తన ఓటమిని అంగీకరించినట్లు.బిజెపితో పొత్తు లేకుంటే జైలు కి వెళ్లి ఊచలు లెక్క పెట్టాలి.అందుకే అడిగిన ఎంపీ సీట్లు ఇవ్వడంతో పాటు, అడగని సీటు బాపట్ల ను కూడా బిజెపి అభ్యర్థికి ఇచ్చాడు.బాపట్లలో పేదలకి సెంటున్నర ఇళ్ల స్థలాలు ఇవ్వడం గొప్ప విషయం అని ప్రజలు భావిస్తుంటే, దీనిపై కూడా విమర్శలు చేయడం వారి అవివేకం.

➡️