సెమీస్కు చేరిన చిక్కోలు చిప్స్, వైజాగ్, సౌత్ జోన్ సిసి చెన్నై జట్లు

Jan 12,2024 00:02

ప్రజాశక్తి – మేదరమెట్ల
రావినూతల గ్రామంలో జరుగుతున్న శ్రీ భ్రమర సంక్రాంతి క్రికెట్ టోర్నమెంట్లో గురువారం జరిగిన మ్యాచ్‌లో చిక్కోలు షీట్స్ వైజాగ్, సౌత్ జోన్ సిసి చెన్నై జట్లు సెమీస్‌కు చేరాయి. ఉదయం జరిగిన మ్యాచ్లో సిక్కోలు చీట్స్ వైజక్, యూవాన్ ప్రాపర్టీస్ హైదరాబాద్ జట్లు తలపడగా చిక్కోలు జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన యువాన్ ప్రాపర్టీస్ హైదరాబాద్ జట్టు నిర్ణీత 20ఓవర్లలో 8వికెట్లను కోల్పోయి 176పరుగులు చేసింది. అనంతరం సిక్కోలు జట్టు 19.3ఓవర్లలో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 177పరుగులు చేసి ఏడు వికెట్ల విజయాన్ని సాధించింది. జట్టులో వినయ్ 42బంతులకు 62పరుగులు చేసి అర్థ సెంచరీ నమోదు చేశాడు. మధ్యాహ్నం జరిగిన సౌత్ జోన్ సిసి, కోకా ఇన్ఫ్రా హైదరాబాద్ జట్టు తలపడగా సౌత్ జోన్ సిసి జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొని నిర్ణీత 20ఓవర్లలో ఐదు వికెట్లను కోల్పోయి 160 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్ చేసిన కోకా ఇన్ఫ్రా హైదరాబాద్ జట్టు 93.3ఓవర్లలో 140పరుగులను మాత్రమే చేసి ఆల్ అవుట్ అయింది. దీంతో సౌత్ జోన్ సిసి జట్టు గెలుపొంది సెమీస్‌కి అర్హత సాధించింది. నేడు ఉదయం థండర్ బర్డ్ తిరుపతి వర్సెస్ మెగా వారియర్ విజయవాడ జట్లు తలపడునున్నాయి. మధ్యాహ్నం లైన్ క్రికెట్ క్లబ్ బెంగళూరు జట్టు ప్రసాద్ స్పోర్ట్స్ హైదరాబాద్ జట్లు తలపడ నున్నాయి.

➡️