ఉద్యోగుల ప్రక్షాళన దిశగా కమిషనర్

Feb 2,2024 22:44

ప్రజాశక్తి – బాపట్ల
స్థానిక పురపాలక సంఘంలో వివిధ విభాగాల్లో సిబ్బంది ప్రక్షాళన దిశగా కొత్త కమిషనర్ రామచంద్రారడ్డి అడుగులు వేస్తున్నారు. పనికి డుమ్మా కొట్టి తిరుగుతున్న సిబ్బందిపై చర్యలకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ప్రజారోగ్య విభాగంలో ఇదే కోవకు చెందిన 30మంది ఉద్యోగుల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. శానిటరీ మేస్త్రిగా చలామణి అవుతున్న ఓ ఉద్యోగి బాధ్యతగా విధులు నిర్వర్తించే విధంగా చర్యలు చేపట్టారు. అధికారులతో నమ్మకంగా వ్యవహరిస్తూ కార్యాలయ అంతర్గత విషయాలు ప్రత్యేక ప్రజా సంబంధాలున్న వ్యక్తులకు చేరవేస్తూ మున్సిపాలిటీలో గొడవలకు కారణం మవుతున్న ఓ ఉద్యోగిపై ప్రత్యేకంగా కన్నేసి ఉంచారు. సమర్థవంతమైన మున్సిపల్ కమిషనర్ రావడం వల్లే ఈ ప్రక్షాళన ఆరంభం కావడం పట్టణలో చర్చ నియాంశమైంది.

➡️