ఫోన్ పోతే ఫిర్యాదు చేయాలి

Jan 30,2024 00:09

ప్రజాశక్తి – చీరాల
పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితుల ఫిర్యాదు మేరకు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి 8సెల్ ఫోన్లను వన్ టౌన్ సిఐ శేషగిరిరావు బాధితులకు అందజేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దారులను పిలిపించి అందజేశారు. సెల్ఫోన్ పోగొట్టుకున్న బాధితులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని అన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో సెల్ఫోన్లను రికవరీ చేయనున్నట్లు తెలిపారు.

➡️